ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి

admin
Read Time0Seconds

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. అబూజ్‌మడ్‌ ప్రాంతంలోని ఇంద్రావతి నది సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

భైరాంగఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్‌మడ్‌‌ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

 

0 0
0 %
Happy
0 %
Sad
0 %
Excited
0 %
Angry
0 %
Surprise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Hyper Aadi, Raising Raju Performance | Jabardasth | 31st January 2019 | ETV Telugu

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. అబూజ్‌మడ్‌ ప్రాంతంలోని ఇంద్రావతి నది సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్‌ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ ధ్రువీకరించారు. ఘటనాస్థలం నుంచి 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భైరాంగఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం […]

Subscribe US Now