మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం : వైఎస్‌ జగన్‌

admin
Read Time0Seconds

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ చేస్తామని, వ్యవస్థల్లో అవినీతి లేకుండా, పరిపాలనలో పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ క్రమంలో న్యాయవాది జగదీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ… 2008లో వెయ్యి పోస్టులతో మాత్రమే జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు వేశారని తెలిపారు. పదేళ్లుగా జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఊసే లేదన్నారు. ‘రాష్ట్రంలో 5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కేవలం మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు వేశారు. ఇది చాలా అన్యాయం. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడంలేదు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేనందువల్లే రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య వేళ్లూనుకుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అదే విధంగా ఫీజు బకాయిలు రద్దు చేసి, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు రూ.5 వేలు, పీజీ విద్యార్థులకు రూ.3వేలు ఇవ్వాలని కోరుతున్నాన్నారు.

0 0
0 %
Happy
0 %
Sad
0 %
Excited
0 %
Angry
0 %
Surprise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ […]

Subscribe US Now