ఇంటి పైకప్పు కూలి నలుగురి మృతి

admin

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో రామజోగి హళ్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. చిన్నారుల తల్లి నాగరత్నమ్మ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం : వైఎస్‌ జగన్‌

admin

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ […]

Subscribe US Now